నిరుపేదలను పీడించేందుకే ఓటీఎస్‌

ABN , First Publish Date - 2021-12-07T06:05:31+05:30 IST

నిరుపేదలకు పీడించడానికే వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ పథకాన్ని అమలు చేస్తున్నదని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ పేర్కొన్నారు.

నిరుపేదలను పీడించేందుకే ఓటీఎస్‌
మాట్లాడుతున్న టీడీపీ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు బుద్ద, పీలా

టీడీపీ పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు బుద్ద, పీలా


అనకాపల్లి, డిసెంబరు 6: నిరుపేదలకు పీడించడానికే వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ పథకాన్ని అమలు చేస్తున్నదని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 65వ వర్ధంతిని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భీమునిగుమ్మం వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓటీఎస్‌ పథకం వల్ల పేదలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌తో పాటు విపరీతంగా పెరిగిపోయిన ధరలతో పూట గడవడమే కష్టమవుతున్న తరుణంలో ప్రభుత్వం బలవంతంగా డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. ఎప్పుడో కట్టిన ఇళ్లకు, ఇంతవరకు ఏ ప్రభుత్వమూ అడగని రుణాలను, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టు అడగడం దారుణమన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసేందుకే ఈ పథకం ప్రవేశపెట్టారని వారు పేర్కొన్నారు. జగన్‌రెడ్డికి పేదలపై చిత్తశుద్ధి ఉంటే ఒక రూపాయకే రిజిస్ర్టేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోట్ని బాలాజీ, సబ్బవరపు గణేశ్‌, మళ్ల సురేంద్ర, జోగినాయుడు, పోలారపు త్రినాథ్‌, బెల్లాన నూకరాజు, నడిపూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T06:05:31+05:30 IST