ఓటీఎస్‌ రద్దు చేయాల్సిందే

ABN , First Publish Date - 2021-12-30T05:57:38+05:30 IST

పేదల నుంచి పది వేల కోట్ల రూపాయలు గుంజాలనే ఆలోచనతోనే వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ స్కీమ్‌ తీసుకువచ్చిందని, దీనిని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. తమ హయాంలో జీవోలు 296, 301, 388 కింద మంజూరుచేసిన చంద్రన్న పట్టాలకు ఉచిత రిజిస్ర్టేషన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు.

ఓటీఎస్‌ రద్దు చేయాల్సిందే
జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు

తెలుగుదేశం పార్టీ నేతల డిమండ్‌ 

జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా  

సిరిపురం, డిసెంబరు 29: పేదల నుంచి పది వేల కోట్ల రూపాయలు గుంజాలనే ఆలోచనతోనే వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్‌ స్కీమ్‌ తీసుకువచ్చిందని, దీనిని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. తమ హయాంలో జీవోలు 296, 301, 388 కింద మంజూరుచేసిన చంద్రన్న పట్టాలకు ఉచిత రిజిస్ర్టేషన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో విశాఖలో 60 వేల నుంచి 80 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చారని, వీటికి ఉచితంగా ఎందుకు మీరు రిజిస్ర్టేషన్‌ చేయడంలేదని ప్రశ్నించారు. జీవో 388 కింద 7.5 శాతానికి అప్పటి రిజిస్ర్టేషన్‌ వాల్యూను బట్టి పేదలకు ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. జీఓ నం 388ని 255 కింద మార్పుచేసి 75 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని,  దీనివల్ల 50 మంది కూడా దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రాలేదన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ రెండేళ్ల లాకింగ్‌ పీరియడ్‌ తరువాత ఏ ప్రభుత్వం వచ్చినా ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. దీనిపై అనేకసార్లు అధికారులను కలిసినా రిజిస్ర్టేషన్‌ హక్కు కల్పించలేదన్నారు. ఎన్టీఆర్‌, ఇందిరాగాంధీ హయాంలో కట్టిన ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో ఇప్పుడు డబ్బు వసూలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఇచ్చిన పట్టాలకు ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేయకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత శ్రీభరత్‌, నియోజకవర్గ ఇన్‌చార్జులు గండిబాబ్జీ, కోరాడ రాజబాబు, ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, ఎండీ నజీర్‌, మూర్తియాదవ్‌, కృష్ణ, జగన్‌, విజయ్‌, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-30T05:57:38+05:30 IST