పరిహారాలు పొందేందుకు జూట్‌మిల్లు అప్రెంటీస్ కార్మికులకు అవకాశం
ABN , First Publish Date - 2021-02-26T06:08:58+05:30 IST
చిట్టివలస జూట్‌మిల్లులో పనిచేసిన అప్రెంటీస్ కార్మికులకు పరిహారాలు అందించడానికి యాజమాన్యం అవకాశం కల్పించింది.

దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు
తగరపువలస, ఫిబ్రవరి 25: చిట్టివలస జూట్‌మిల్లులో పనిచేసిన అప్రెంటీస్ కార్మికులకు పరిహారాలు అందించడానికి యాజమాన్యం అవకాశం కల్పించింది. ఇంతవరకు మిల్లులో పనిచేసిన రెగ్యులర్ కార్మికుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారి బ్యాంకు ఖాతాలలో పరిహారాల నగదును జమ చేశారు. ఇప్పుడు అప్రెంటీస్ కార్మికులకు అవకాశం ఇవ్వడం వల్ల ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న వారికి ప్రయోజనం కలుగుతుందని ఐక్య కార్మిక సంఘాల నాయకులు గురువారం తెలిపారు. వీరి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు జూట్‌మిల్లు వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఐక్య కార్మిక సంఘాలైన కాంగ్రెస్ కార్మిక సంఘం, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీఎన్‌టీయూసీ సంఘాలకు చెందిన కేవీ కైలాశ్‌రెడ్డి, దల్లి అప్పలరెడ్డి, ఎం.ఆదినారాయణ, చిల్ల రమణ, కె.అప్పలసూరి, ఎం.దేముళ్లు, కె.ఈశ్వరరావు జూట్‌మిల్లు వద్ద ఏర్పాటు చేసిన శిబిరం వద్ద దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అప్రెంటీస్‌లుగా తాము పని చేసినట్టు ఆధారాలను, ఆధార్ కార్డు, ఫొటో గుర్తింపు కార్డులను తమకు అందించాలని కోరారు.