రెండో రోజు కొనసాగిన ఆపరేషన్‌ ముస్కాన్‌

ABN , First Publish Date - 2021-05-21T04:49:56+05:30 IST

ఆపరేషన్‌ ముస్కాన్‌ రెండో రోజైన గురువారం కూడా పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో కొనసాగింది.

రెండో రోజు కొనసాగిన ఆపరేషన్‌ ముస్కాన్‌
వేంపాడు ఇటుక బట్టీల వద్ద బాల కార్మికులను గుర్తిస్తున్న పోలీసులు


పాయకరావుపేట/ నక్కపల్లి, మే 20 : ఆపరేషన్‌ ముస్కాన్‌ రెండో రోజైన గురువారం కూడా పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా పాయకరావుపేటలోని పలు మెకానిక్‌ షెడ్లు, టైర్లు, కిరాణా షాపులు, హోటళ్లతో పాటు పి.ఎల్‌.పురంలోని ఇటుక బట్టీల్లో ఎస్‌ఐ డి.దీనబంధు తనిఖీలు నిర్వహించారు. చిన్న పిల్లలను పనుల్లో పెట్టుకోకూడదని, షాపుల నిర్వాహకులు తమ  కుటుంబంలోని చిన్న పిల్లలతో కూడా పనులు చేయించకూడదని స్పష్టం చేశారు. అలాగే, నక్కపల్లి మండలంలో ఎస్‌ఐ అప్పన్న బృందం వివిధ షాపుల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించారు.  వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్‌ వచ్చింది. అనంతరం ఐసీడీఎస్‌ సిబ్బంది ఆధ్వర్యంలో కౌన్సిలింగ్‌ జరిపి తల్లిదండ్రులకు ఆయా పిల్లలను అప్పగించారు. 


Updated Date - 2021-05-21T04:49:56+05:30 IST