రెండో రోజు 26 కిలోల చందనం అరగదీత

ABN , First Publish Date - 2021-05-09T04:51:51+05:30 IST

చందనోత్సవం సందర్భంగా ఈనెల 14న వరాహ లక్ష్మీనృసింహస్వామికి తొలివిడత పై పూతగా పూసేందుకు గాను రెండో రోజైన శనివారం సుమారు 26 కిలోల చందనాన్ని సిబ్బంది అరగదీశారు.

రెండో రోజు 26 కిలోల చందనం అరగదీత
చందనం అరగదీతలో పాల్గొన్న సిబ్బంది

సింహాచలం, మే 8: చందనోత్సవం సందర్భంగా ఈనెల 14న వరాహ లక్ష్మీనృసింహస్వామికి తొలివిడత పై పూతగా పూసేందుకు గాను రెండో రోజైన శనివారం సుమారు 26 కిలోల చందనాన్ని సిబ్బంది అరగదీశారు. సుమారు 15 మంది నాలుగో తరగతి సిబ్బంది ప్రభాత ఆరాధనల తర్వాత నుంచి మధ్యాహ్నం రాజభోగం నివేదన సమయం వరకు చందనాన్ని అరగదీశారు. 26 కిలోల చందనపు ముద్దను అధికారులు బాంఢాగారంలో భ్రదపరచారు. మరో నాలుగు రోజుల పాటు తొలివిడత చందనం అరగదీత కొనసాగనున్నది.

Updated Date - 2021-05-09T04:51:51+05:30 IST