పూర్వ విద్యార్థుల కలయిక

ABN , First Publish Date - 2021-03-01T06:20:04+05:30 IST

మండల కేంద్రం మాకవరపాలెం హైస్కూల్‌లో 1994-95 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారంతా ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు.

పూర్వ విద్యార్థుల కలయిక
మాకవరపాలెం పాఠశాలలో కలిసిన పూర్వ విద్యార్థులు


మాకవరపాలెం, ఫిబ్రవరి 28 : మండల కేంద్రం మాకవరపాలెం హైస్కూల్‌లో 1994-95 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారంతా ఆదివారం పాఠశాలలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా నాటి రోజుల్లో మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నాడు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సరదాగా గడిపారు. సుమారు యాభై మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.

Updated Date - 2021-03-01T06:20:04+05:30 IST