అనవసరంగా బయట తిరగొద్దు

ABN , First Publish Date - 2021-05-03T04:33:42+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయట తిరగకూడదని ఎస్‌ఐ పి.విభీషణరావు విజ్ఞప్తి చేశారు.

అనవసరంగా బయట తిరగొద్దు
గాంధీగ్రామంలో ప్రచారం చేస్తున్న ఎస్‌ఐ విభీషణరావు

గ్రామాల్లో కరోనాపై పోలీసుల ప్రచారం

చోడవరం, మే 2:
కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయట తిరగకూడదని ఎస్‌ఐ పి.విభీషణరావు విజ్ఞప్తి చేశారు. మండలంలోని గాంఽధీ గ్రామంలో  సిబ్బందితో కలిసి ఆదివారం కరోనాపై అప్రమత్తంగా ఉండాలంటూ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించి రక్షణ పొందాలని కోరారు.  గ్రామాల్లో అనవసరంగా అందరూ ఒకే చోట చేరి ముచ్చట్లు పెట్టుకోవద్దని, టీకాలు వేసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-05-03T04:33:42+05:30 IST