చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు

ABN , First Publish Date - 2021-02-05T07:17:39+05:30 IST

మండలంలోని 24 పంచాయతీల్లో చివరి రోజు సర్పంచ్‌, వార్డు స్థానాలకు నామినేషన్లు పోటాపోటీగా దాఖలయ్యాయి.

చివరి రోజు పోటాపోటీగా నామినేషన్లు
కొత్తకోటలో నామినేషన్ల వేసేందుకు రాత్రి 9గంటల వరకు ఉన్న అభ్యర్ధులు

రోలుగుంటలో సర్పంచ్‌ స్థానాలకు 152.. వార్డు స్థానాలకు 763 


రోలుగుంట: మండలంలోని 24 పంచాయతీల్లో చివరి రోజు సర్పంచ్‌, వార్డు స్థానాలకు నామినేషన్లు పోటాపోటీగా దాఖలయ్యాయి. మొత్తం సర్పంచ్‌ స్థానాలకు 152, వార్డు స్థానాలకు 763 నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీడీపీ మద్దతతో నిండుగొండలో సుర్ల అనురాధ, పడాల పాలెం పంచాయతీకి లగుడు సత్యవతి, కుసర్లపూడిలో గండి తాతాజీ, గండి సింహద్రి, కొండపాలెంలో బంటు చిరంజీవి, వడ్డిపలో వుండా అమ్మాజీ, జె.నాయుడుపాలెంలో బోడాపాత్రుని జగద నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే వైసీపీ మద్దతుతో కొవ్వూరులో యర్రంశెట్టి కాంతమ్మ, కొమరవోలులో గొర్లె చెల్లమ్మనాయుడు, పడాలపాలెంలో జెర్రిపోతుల రామలక్ష్మి, జేపీ అగ్రహారంలో చిటికెల పద్మ, అడ్డసరంలో విసారపు కృష్ణ, గుండుబాడులో మామిడి రాము నామినేషన్లు వేశారు. 


రావికమతంలో సర్పంచ్‌లకు 141.. వార్డులకు 877

రావికమతం: మండలంలో అఖరి రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 24 పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలకు 141 మంది, 27 పంచాయతీల్లో వార్డు స్థానాలకు 877 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కొత్తకోటలో ఐదు గంటల ముందు వచ్చిన వారందరినీ క్యూలో ఉంచి టోకెన్‌లు ఇచ్చి రాత్రి తొమ్మిదిన్నర వరకు నామినేషన్లు స్వీకరించారు. 

Updated Date - 2021-02-05T07:17:39+05:30 IST