ఎన్నికల్లో నోడల్‌ అధికారుల పాత్ర కీలకం

ABN , First Publish Date - 2021-02-26T06:02:09+05:30 IST

మునిసిపల్‌ ఎన్నికల్లో నోడల్‌ అధికారుల పాత్ర చాలా కీలకమని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య అన్నారు.

ఎన్నికల్లో నోడల్‌ అధికారుల పాత్ర కీలకం
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య

 

నర్సీపట్నం, ఫిబ్రవరి 25 : మునిసిపల్‌ ఎన్నికల్లో నోడల్‌ అధికారుల పాత్ర చాలా కీలకమని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య అన్నారు. గురువారం సాయంత్రం మునిసిపల్‌ కార్యాలయంలో నోడల్‌ అధికారులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. నోడల్‌ అధికారులు వారికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు.  మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, తహసీల్దార్‌ జయ, ఎంపీడీవో జయమాధవి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-26T06:02:09+05:30 IST