అప్పన్న ఆలయంలో ఘనంగా అమావాస్య పూజలు

ABN , First Publish Date - 2021-03-14T05:47:33+05:30 IST

మాఘమాస బహుళపక్ష అమావాస్య సందర్భంగా వరాహలక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో సంప్రదాయబద్ధంగా శనివారం మధ్యాహ్నం రాజభోగ నివేదనకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అప్పన్న ఆలయంలో ఘనంగా అమావాస్య పూజలు
గ్రామ బలిహరణ చేస్తున్న అర్చకులు

సింహాచలం, మార్చి 13: మాఘమాస బహుళపక్ష అమావాస్య సందర్భంగా వరాహలక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో సంప్రదాయబద్ధంగా శనివారం మధ్యాహ్నం రాజభోగ నివేదనకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా చక్ర పెరుమాళ్‌ను ప్రత్యేక పల్లకిలో ఉంచి సింహగిరి ప్రధాన మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. ముఖ్య అర్చకుడు సాతులూరి నరసింహాచార్యులు మాడవీధుల్లోని అష్ట దిక్పాలకులకు షోడశోపచారాలను సమర్పించి నివేదనలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనాలను నిలిపివేసి రాజభోగ నివేదన గావించారు. ఆ తర్వాత యథావిధిగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. 

Updated Date - 2021-03-14T05:47:33+05:30 IST