నూతన ఆలోచనలు యువత సొంతం

ABN , First Publish Date - 2021-12-28T06:00:36+05:30 IST

నూతన ఆలోచనలతో పనిచేసే శక్తి యువత సొంతమని స్టీల్‌ ప్లాంట్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అతుల్‌భట్‌ అన్నారు.

నూతన ఆలోచనలు యువత సొంతం
సీఎండీ అతుల్‌భట్‌ను సత్కస్తున్న వీసీ ప్రసాద్‌రెడ్డి, తదితరులు

స్టీల్‌ ప్లాంట్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అతుల్‌భట్‌

కామర్స్‌ పరిశోధక విద్యార్థిగా చేరిన సీఎండీ 

ఏయూ క్యాంపస్‌, డిసెంబరు 27: నూతన ఆలోచనలతో పనిచేసే శక్తి యువత సొంతమని స్టీల్‌ ప్లాంట్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అతుల్‌భట్‌ అన్నారు. సోమవారం ఆయన ఏయూను సందర్శించి వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి సమక్షంలో వర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అతుల్‌భట్‌ మాట్లాడుతూ యువతను ప్రొత్సహించే దిశగా హ్యాక్‌థాన్‌ను తాము నిర్వహించామన్నారు. పరిశ్రమల అవసరాలు, సమస్యలను గుర్తించి పరిష్కారం చూపే దిశగా యువత పనిచేయాలని సూచించారు. పనిచేయడం యవత సొంతమన్నారు. వీసీ ప్రసాదరెడ్డి మాట్లాడతూ యువతను ప్రొత్సహిస్తూ మార్గదర్శకం అందించేలా స్టార్టప్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ సమత, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ రవీంద్రనాథ్‌బాబు, ప్రొఫెసర్లు శోభశ్రీ, కృష్ణమోహన్‌, ఎస్‌కే భట్‌, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ భట్‌ ఏయూ కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో పరిశోధక విద్యార్థిగా ప్రవేశం పొందారు. ప్రవేశ పత్రాన్ని ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి నుంచి ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా అతుల్‌భట్‌ను వీసీ, తదితరులు ఘనంగా సత్కరించారు.


Updated Date - 2021-12-28T06:00:36+05:30 IST