గెడ్డ సమస్యపై కోస్టుగార్డు అధికారులతో చర్చలు
ABN , First Publish Date - 2021-05-25T05:00:58+05:30 IST
జీవీఎంసీ 62వ వార్డు దుర్గానగర్‌లో దీర్ఘకాలంగా ఉన్న గెడ్డ సమస్యపై కోస్టుగార్డు అధికారులతో జీవీఎంసీ జోన్ 5 జోనల్ కమిషనర్ సింహాచలం, వైసీపీ పశ్చిమ కన్వీనర్ మళ్ల విజయప్రసాద్ సోమవారం సాయంత్రం చర్చించారు.

మల్కాపురం, మే 24 : జీవీఎంసీ 62వ వార్డు దుర్గానగర్‌లో దీర్ఘకాలంగా ఉన్న గెడ్డ సమస్యపై కోస్టుగార్డు అధికారులతో జీవీఎంసీ జోన్ 5 జోనల్ కమిషనర్ సింహాచలం, వైసీపీ పశ్చిమ కన్వీనర్ మళ్ల విజయప్రసాద్ సోమవారం సాయంత్రం చర్చించారు. అల్లూరి సీతారామరాజు కాలనీ, గుడివాడ అప్పన్న కాలనీ, తెలుగుదేశం కాలనీ, ఎన్టీఆర్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజల వాడుక నీరు దుర్గానగర్ గెడ్డలో కలుస్తుంది. అయితే ఈ గెడ్డ మార్గం కోస్టుగార్డు కాలనీలో ఉండడం వల్ల తరచూ కోస్టుగార్డు సిబ్బంది ఇనుప ఊచలు అడ్డుపెడుతున్నారు. దీని వల్ల మురుగునీరు నిలిచిపోవడంతో పాటు చెత్తాచెదారం పేరుకుపోయి పలు ప్రాంతాలు ముంపునకు గురవుతు న్నాయి. ఈ విషయాన్ని కోస్టుగార్డు అధికారుల దృష్టికి జోనల్ కమిషనర్ తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కోస్టుగార్డు అధికారులు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కోస్టుగార్డు నుంచి ఇద్దరు సిబ్బందిని, జీవీఎంసీ నుంచి ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేసి కోస్టుగార్డు లోపల ఉన్న గెడ్డ భాగాన్ని శుభ్రం చేయిద్దామని ప్రతిపాదించారు. దీనికి జోనల్ కమిషనర్ అంగీకరించారు. ఈ సమావేశంలో వార్డు కార్పొరేటర్ బళ్ల లక్ష్మణరావు, ఏఎంహెచ్‌వో రాజేశ్, ఈఈ రత్నాలరాజు, డీఈ ఏడుకొండలు, ఏఈ సత్యనారాయణ, ఆర్‌ఐ శివ, కోస్టుగార్డు అధికారులు హుస్సేన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.