11న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-11-21T06:23:18+05:30 IST

సుప్రింకోర్టు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థల ఆదేశానుసారం వచ్చే నెల 11న జాతీయ లోక్‌ అధాలత్‌ కార్యక్రమం నిర్వహించనున్నామని 13వ అదనపు జిల్లా జడ్జి పి.కేశవాచార్యులు పేర్కొన్నారు.

11న జాతీయ లోక్‌ అదాలత్‌
సమావేశంలో పాల్గొన్న న్యాయమూర్తులు, ఇతర అధికారులు

గాజువాక, నవంబరు 20: సుప్రింకోర్టు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థల ఆదేశానుసారం వచ్చే నెల 11న జాతీయ లోక్‌ అధాలత్‌ కార్యక్రమం నిర్వహించనున్నామని 13వ అదనపు జిల్లా జడ్జి పి.కేశవాచార్యులు పేర్కొన్నారు. కోర్టులో శనివారం ఆయన జడ్జిలు, వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా చాలా వరకు కేసులు పరిష్కారం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో 3వ అదనపు మేజిస్ట్రేట్‌ బి.నిర్మల, 8వ అదనపు మేజిస్ట్రేట్‌ బి.సాధుబాబు, జూనియర్‌ సివిల్‌ జడ్జి వై.ప్రేమలత, ఏసీపీ రాజ్‌కమల్‌, బార్‌ కౌన్సిల్‌ కార్యదర్శి లెనిన్‌ తదితరులు పాల్గొన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలని బార్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు వెన్నెల ఈశ్వరరావు కోరారు. 

Updated Date - 2021-11-21T06:23:18+05:30 IST