ఏయూతో నాస్‌కామ్‌ అవగాహన ఒప్పందం

ABN , First Publish Date - 2021-03-21T06:11:55+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీ (నాస్‌కామ్‌) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

ఏయూతో నాస్‌కామ్‌ అవగాహన ఒప్పందం
వీసీ ప్రసాద్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న ప్రతినిధులు

ఏయూ క్యాంపస్‌, మార్చి 20: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీ (నాస్‌కామ్‌) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. శనివారం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, నాస్‌కామ్‌ సెంటర్‌ హెడ్‌ ఎం.కల్యాణ్‌లు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ఉపయుక్తంగా ఉండేలా ఈ కేంద్రం సేవలందించాలని సూచించారు. ఏయూకు అనుబంధంగా లేని కళాశాలల విద్యార్థులకు సైతం ఈ కేంద్రం సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. సెంటర్‌ హెడ్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ కేంద్రంలో ల్యాబ్‌ ఏర్పాటు, స్టార్టప్‌-ఇంక్యుబేషన్ల పర్యవేక్షణ, పరిశ్రమలతో అనుసంధానం చేయడం, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు అందించడం, టెక్నికల్‌ వర్క్‌షాప్‌ల నిర్వహణ, ఇన్నోవేషన్‌ సమిట్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తిఠీ కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ సమత, ప్రొఫెసర్లు పేరి శ్రీనివాసరావు, డాక్టర్‌ హెచ్‌.పురుషోత్తం, రవి, భుజంగరావు, రమాసుధ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-21T06:11:55+05:30 IST