స్థానిక ఎన్నికల్లో విజయానికి కృషిచేయాలి

ABN , First Publish Date - 2021-01-20T06:07:49+05:30 IST

రానున్న స్థానిక ఎన్నికల్లో విజయానికి పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషిచేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

స్థానిక ఎన్నికల్లో విజయానికి కృషిచేయాలి
మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌


టీడీపీ శ్రేణులకు మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపు 


హుకుంపేట, జనవరి 19: రానున్న స్థానిక ఎన్నికల్లో విజయానికి పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషిచేయాలని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం హుకుంపేట, డుంబ్రిగుడ, పెదబయలు, అరకులోయ మండలాల నాయకులతో దాలిగుమ్మడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన  మాట్లాడారు. ప్రజలు, కార్యకర్తల సమస్యలను నాయకులు తెలుసుకొని, వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అలాగే మండల కమిటీల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని, మండల అధ్యక్ష, పదవులను యువతకు కేటాయించాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో తీసుకువెళ్లాలన్నారు. అనంతరం టీడీపీ నేతలు సివేరి అబ్రహం, సివేరి దొన్నుదొర, నియోజకవర్గ పరిశీలకుడు లొడగల కృష్ణ మాట్లాడారు. ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు శెట్టి లక్ష్మణుడు, బాకురు వెంకటరమణరాజు, నాగేశ్వరరావు, శెట్టి అప్పాలు, కంబిడి సుబ్బారావు, పాండురంగస్వామి, బొడ్డా శ్యామ్‌, సాగరి సుబ్బారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-20T06:07:49+05:30 IST