ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
ABN , First Publish Date - 2021-02-01T06:41:16+05:30 IST
పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని విశాఖ రేం జ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు కోరారు.

విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు
తుమ్మపాల, జనవరి 31: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని విశాఖ రేం జ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు కోరారు. ఆదివారం రాత్రి తుమ్మపాలలో సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు నామినేషన్లు వేసిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను పోలీస్ కేసులకు తావులేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల వరకు రాజకీయాలు పరిమితమని, తరువాత ప్రతి ఒక్కరూ కుటుంబం లా ముందుకు సాగాలన్నారు. అభ్యర్థులు ప్రజాతీర్పును గౌరవించాలన్నా రు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ నిఘా ఉంటుందన్నారు. బవులవాడ, మామిడిపాలెంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు పర్యటించి గ్రామస్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.శ్రావణి, సీఐలు ఎల్.భాస్కరరావు, శ్రీనివాసరావు, ఎస్‌ఐలు రామకృష్ణ, ధనుంజయ్, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.