హత్య కేసు నిందితుడికి రిమాండ్‌

ABN , First Publish Date - 2021-12-19T05:53:05+05:30 IST

బీచ్‌రోడ్డులోని గోవుపేటలో భార్యను హత్య చేసిన నిందితుడు మైలపల్లి హరిని శనివారం రాత్రి భీమిలి పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించారు.

హత్య కేసు నిందితుడికి రిమాండ్‌

భీమునిపట్నం, డిసెంబరు 18: బీచ్‌రోడ్డులోని గోవుపేటలో భార్యను హత్య చేసిన నిందితుడు మైలపల్లి హరిని శనివారం రాత్రి భీమిలి పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించారు. ఈ నెల 16వ తేదీ రాత్రి భార్య నరసయ్యమ్మ నిద్రి స్తుండగా మెడకు ఉరి బిగించి నిందితుడు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం నిందితుడు హరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా నేరాన్ని అంగీంకరించాడు. తనను వేరే కాపురం పెట్టమని, పతులు వేయవద్దని, నగరానికి వెళ్లిపోదామని చెబుతుండడం వల్లే భార్యను హతమార్చినట్టు నిందితుడు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. కాగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విఽధించడంతో నిందితుడు హరిని ఆరిలోవలోని కేంద్ర కారాగారానికి తరలించినట్టు ఎస్‌ఐ పి.రాంబాబు  పేర్కొన్నారు.


Updated Date - 2021-12-19T05:53:05+05:30 IST