ఏయూతో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ఎంవోయూ

ABN , First Publish Date - 2021-08-28T05:29:35+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం ఒప్పంద పత్రాలపై రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఎంఎస్‌ఎంఈ సెంటర్‌ డీజీఎం ప్రసాద్‌రెడ్డి సంతకాలు చేశారు.

ఏయూతో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ఎంవోయూ
వీసీ ప్రసాద్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న ప్రతినిధులు

 ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 27: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం ఒప్పంద పత్రాలపై  రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఎంఎస్‌ఎంఈ సెంటర్‌ డీజీఎం ప్రసాద్‌రెడ్డి సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా యువ ఆవిష్కర్తలను తీర్చిదిద్దేందుకు వీలుగా విద్యారులకు నైపుణ్య శిక్షణ కోర్సులను, వివిధ పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌ను అందిస్తారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ డీడీ కాలేబు, ఏయూ ఇంక్యూబేషన్‌ సెంటర్‌ సీఈవో రవి ఈశ్వరపు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-28T05:29:35+05:30 IST