లోకేష్ భాష అసభ్యంగా, తలవంపులు తెచ్చేలా ఉంది: Vijayasai
ABN , First Publish Date - 2021-11-13T18:56:59+05:30 IST
కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలు వైసీపీ గెలుస్తుందని...ఎటువంటి సందేహం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: కుప్పంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలు వైసీపీ గెలుస్తుందని...ఎటువంటి సందేహం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత టీడీపీ తుడిచిపెట్టుకొని పోతుందన్నారు. లోకేష్ భాష అసభ్యంగా, తలవంపులు తెచ్చే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీకి భవిష్యత్ నాయకుడుగా ప్రాజెక్ట్ అవుతున్న వ్యక్తి తాను మాట్లాడే భాష తగునా అని ప్రశ్నించారు. జీవీఎంసీలో రెండు వార్డుల్లో వైసీపీ ఘన విజయం ఖాయమన్నారు. ఈ ఉప ఎన్నికల ఫలితాలు 2024 నాటి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అనటానికి నిదర్శనంగా తీసుకుంటామని ఎంపీ విజయసాయి తెలిపారు.