లోక్‌సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: ఎంపీ సత్యనారాయణ

ABN , First Publish Date - 2021-02-05T19:21:41+05:30 IST

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఎంపీ సత్యనారాయణ అన్నారు.

లోక్‌సభలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: ఎంపీ సత్యనారాయణ

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఎంపీ సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది ప్రాణాలు త్యాగాలు చేశారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను లోక్‌సభలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని తెలిపారు. ఇదే విషయం సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ సత్యనారాయణ పేర్కొన్నరు. 

Updated Date - 2021-02-05T19:21:41+05:30 IST