స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు ఉద్యమాలు ఉధృతం
ABN , First Publish Date - 2021-08-26T05:24:26+05:30 IST
విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణకు కార్మికులు ఉద్యమాలను ఉధృతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు.

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ
కూర్మన్నపాలెం, ఆగస్టు 25: విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణకు కార్మికులు ఉద్యమాలను ఉధృతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉక్కు ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 195వ రోజు కొనసాగాయి. బుధవారం ఈ దీక్షలలో ఈఎండీ, యూటీఎల్, డబ్ల్యూఎండీ విభాగాల కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాల్సిన భాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు నీరుకొండ రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించేలా కార్మికులు ఉద్యమాలను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు మంత్రి రాజశేఖర్, జె.అయోధ్యరామ్, కె.సత్యనారాయణ, గంధం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.