స్థానికులకు ఉపాధి కల్పించకుంటే ఉద్యమం
ABN , First Publish Date - 2021-12-15T06:31:12+05:30 IST
పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించకపోతే ఉద్యమిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరావు హెచ్చరించారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరావు
ఎలమంచిలి, డిసెంబరు 14: పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించకపోతే ఉద్యమిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరావు హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సెజ్‌లో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అపాకాశాలు కల్పించాలన్నారు. పార్టీ కార్యక్రమాలకు క్యాడర్ విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ విజయం సాధించాలని సూచించారు. ఈ సందర్భంగా రాంబిల్లి నేత దిన్‌బాబు, మునగపాక మండల అధ్యక్షుడు దొడ్డి శ్రీను, మాజీ అద్యక్షుడు దాడి ముసిలినాయుడు, పట్టణ మాజీ అధ్యక్ష, కార్యదర్శులు కొఠారు సాంబ, ఆడారి ఆదిమూర్తి తదితరులు సమస్యలను వివరించడంతో పాటు పార్టీ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. అనంతరం సెజ్ కాలనీ ఎంపీటీసీ-3గా గెలుపొందిన నీరుకొండ నరసింగరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు దూలి రంగనాయకులు, రాజాన రమేశ్, ఆర్‌ఎస్.నాగేశ్వరావు, కె.చిరంజీవి, ఇత్తంశెట్టి రాజు, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, డ్రీమ్స్ నాయుడు, ఎంకునాయుడు, ఆడారి రమణబాబు పాల్గొన్నారు.