ప్లాంట్‌ ప్రగతికి మరింత కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-10-31T06:39:24+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రగతికి మరింత కృషి చేయాలని స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ అన్నారు.

ప్లాంట్‌ ప్రగతికి మరింత కృషి చేయాలి
కార్మిక సంఘ నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌

ఉక్కు సీఎండీ అతుల్‌భట్‌

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 30: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రగతికి మరింత కృషి చేయాలని స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ అన్నారు. సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఉక్కు కార్మిక సంఘ నాయకులతో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఉక్కు ఉత్పత్తి, ఉత్పాదకతను మరిత పెంచాలని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంస్థ ప్రగతికి కార్మిక సంఘాలు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. కార్మిక సంక్షేమం విషయంలో యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు పలు సమస్యలను విన్నవించగా, పరిష్కరిస్తామని సీఎండీ హామి ఇచ్చారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌లు వీవీ వేణుగోపాల్‌రావు, డీకే మహంతి, సక్సేనా, కార్మిక నాయకులు జె.అయోధ్యరామ్‌, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, వై.మస్తానప్ప, గంధం వెంకటరావు, నీరుకొండ రామచంద్రరావు, కేఎస్‌ఎన్‌రావు, దొమ్మేటి అప్పారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-31T06:39:24+05:30 IST