అమ్మవారి క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-01-14T04:39:46+05:30 IST

నాయుడుతోట రవినగర్‌ నర్సింగబిల్లి అమ్మవారి ఆలయంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ బుధవారం ఆవిష్కరించారు.

అమ్మవారి క్యాలెండర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
క్యాలెండర్‌ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే

వేపగుంట జనవరి 13: నాయుడుతోట రవినగర్‌ నర్సింగబిల్లి అమ్మవారి ఆలయంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ బుధవారం ఆవిష్కరించారు. భోగి రోజున కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.వైసీపీ నేతలు ఆదిరెడ్డి మురళి,  సంపత్‌వర్మ, రాజు, రామిరెడ్డి, రాంబాబు, రామరాజు పాల్గొన్నారు. 


రాజకీయాలకతీతంగా ఇళ్ల పట్టాలు  

పరవాడ: రాజకీయాలకతీతంగా ప్రభు త్వం ఇళ్ల పట్టాలు అందజేసిందని ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ పేర్కొన్నారు. బుధవారం దళాయిపాలెంలోని గెస్ట్‌హౌస్‌ వద్ద విలేఖరులతో మాట్లాడారు. వైసీపీ కండు వా వేసుకున్న వారికి మాత్రమే పట్టాలు పంపిణీ చేశారని టీడీపీ నేతలు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. వాడచీపురుపల్లి తూర్పు రెవెన్యూ ఖండం సర్వే నంబర్‌ 180లో ఇసుక తవ్వకాలకు గనులశాఖకు దరఖాస్తు చేసి, అనుమతులు ఇచ్చాకే తవ్వకాలు జరుపుతామన్నారు. అన్నంరెడ్డి అజయ్‌రాజ్‌, శ్రీనివాసరావు, అప్పలనాయు డు, వై.సన్యాసిరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T04:39:46+05:30 IST