విశాఖ టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక మంత్రి ముత్తంశెట్టి
ABN , First Publish Date - 2021-10-21T05:16:39+05:30 IST
విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రోత్సాహంతోనే దాడి జరిగిందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు ఆరోపించారు. బుధవారం సాయంత్రం చిన్నబజారు పార్టీ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ కిరాయివ్యక్తులతో దాడి చేయించిన మంత్రిపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు.

భీమిలి టీడీపీ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు
భీమునిపట్నం, అక్టోబరు 20: విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రోత్సాహంతోనే దాడి జరిగిందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోరాడ రాజబాబు ఆరోపించారు. బుధవారం సాయంత్రం చిన్నబజారు పార్టీ కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ కిరాయివ్యక్తులతో దాడి చేయించిన మంత్రిపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా జగన్‌రెడ్డి పాలన సాగుతోందన్నారు. కొడాలి నాని, పేర్ని నాని పచ్చి బూతులు మాట్లాడుతుంటారని, అవేవీ వినిపించడం లేదా... టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఏం తప్పు మాట్లాడారని ఇంత విఽధ్వంసానికి పాల్పడ్డారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని, మా వారికి బీపీ వస్తే ఇలానే ఉంటుందని అధినాయకులే మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా పోలీసులు టీడీపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడిన కిరాయి గుండాలపై చర్యలు తీసుకోవాలని, టీడీపీ కార్యకర్తలకు బీపీ పెరిగితే భవిష్యత్తు పరిణామాలను ఊహించుకోవచ్చని హెచ్చరించారు. భీమిలి డివిజన్ అధ్యక్షుడు గంటా నూకరాజు మాట్లాడుతూ అసమర్థపాలనపై ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని మళ్లించడానికే దాడులకు తెగబడ్డారన్నారు. సమావేశంలో నేతలు డీఏఎన్ రాజు కోరాడ రమణ, పాసి నరసింగరావు, బడిగంటి నీలకంఠం, కురిమిన లీలావతి, సరగడ అప్పారావు. తదితరులు పాల్గొన్నారు.