మత్స్యకారులు సంయమనం పాటించాలి

ABN , First Publish Date - 2021-01-20T05:52:39+05:30 IST

సముద్ర తీరానికి దగ్గరగా రింగు వలలతో చేపలను వేటాడటంపై సాంకేతిక బృందం అధ్యయనం చేస్తున్నదని, ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు మత్స్యకారులు అంతా సంయమనం పాటించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు.

మత్స్యకారులు సంయమనం పాటించాలి
కలెక్టర్‌, సీపీ, జేసీలతో సమావేశమైన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): సముద్ర తీరానికి దగ్గరగా రింగు వలలతో చేపలను వేటాడటంపై సాంకేతిక బృందం అధ్యయనం చేస్తున్నదని, ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు మత్స్యకారులు అంతా సంయమనం పాటించాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆయన ప్రభుత్వ అఽతిథి గృహంలో దీనిపై కలెక్టర్‌ వినయచంద్‌, పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా, జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిలతో మంగళవారం సమావేశం అయ్యారు. నివేదిక రావడానికి ఇంకొంత సమయం పడుతుందని కలెక్టర్‌ చెప్పడంతో అంతవరకు మత్స్యకారులు ఘర్షణలకు దిగకుండా నివారించాలని సూచించారు. ఈ సమావేశంలో  దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-20T05:52:39+05:30 IST