ఆ 4 వార్డులకు కనీస వసతులు

ABN , First Publish Date - 2021-12-28T06:03:42+05:30 IST

జీవీఎంసీ భీమిలి జోన్‌ పరిధిలోని నాలుగు వార్డులలో కనీస వసతులు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఆ 4 వార్డులకు కనీస వసతులు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

భీమునిపట్నం (రూరల్‌), డిసెంబరు 27: జీవీఎంసీ భీమిలి జోన్‌ పరిధిలోని నాలుగు వార్డులలో కనీస వసతులు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం వలందపేట పరిధిలో రూ.66 లక్షల వ్యయంతో నిర్మించనున్న రహదారులు, కాలువల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పారిశుధ్యం, తాగు నీరు, విద్యుత్‌ వంటి అవసరాలను తీర్చడానికి కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో జడ్సీ వెంకటరమణ, కార్పొరేటర్‌ కొండబాబు, జీవీఎంసీ కోఆప్షన్‌ సభ్యురాలు కొప్పల ప్రభావతి, వైసీపీ నాయకులు షణ్ముఖరావు, కరుణాకరరెడ్డి, వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.   .


Updated Date - 2021-12-28T06:03:42+05:30 IST