సెప్టెంబరు 5 వరకు టెన్త్‌ విద్యార్థులకు మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు

ABN , First Publish Date - 2021-08-12T04:27:19+05:30 IST

పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు వచ్చే నెల ఐదో తేదీ వరకు మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

సెప్టెంబరు 5 వరకు టెన్త్‌ విద్యార్థులకు మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు

చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకోవాలి

జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి

విశాఖపట్నం, ఆగస్టు 11: పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు వచ్చే నెల ఐదో తేదీ వరకు మైగ్రేషన్‌ సర్టిఫికెట్లు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష రుసుముతోపాటు రూ.80లు అదనంగా చెల్లించిన వారికి మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ను సంబంధిత పాఠశాల లాగిన్‌లో అప్‌లోడ్‌ చేస్తామని చెప్పారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ఈ సర్టిఫికెట్‌ల కలర్‌ ప్రింట్‌లు తీయించి విద్యార్థులకు అందిస్తారని తెలిపారు. సెప్టెంబరు ఐదులోగా మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ పొందని వారు ఆ తర్వాత మళ్లీ రూ.80లు రుసుము చెల్లించి సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులే కాకుండా, ముందు సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారు కూడా  పరీక్షల సంచాకుల వారి కార్యాలయానికి ఆన్‌లైన్‌లో మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌ కోసం రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా తమ సర్టిఫికెట్‌ పొందవచ్చునన్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు, సూచనలతో ఓ వీడియో రూపొందించి వెబ్‌సైటులో ఉంచనున్నట్లు డీఈవో తెలిపారు. 

Updated Date - 2021-08-12T04:27:19+05:30 IST