ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ABN , First Publish Date - 2021-12-26T05:48:52+05:30 IST
పాడేరు పట్టణంలోని చర్చిలలో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పాడేరురూరల్: పాడేరు పట్టణంలోని చర్చిలలో శనివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కారుణ్య, సీబీఎం, బేతని, హైమోస్టు హాలీగాఢ్ చర్చి, ప్రభువైన ఏసుక్రీస్తు ప్రార్థనామందిరం, సర్వోన్నతుడైన మందిరంలలో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఆయా చర్చిల్లో పాస్టర్‌లు తిమోతి, వెయిన్‌జోషఫ్, జాన్‌పాల్, రీమాలి జాన్, బి.ఎలీషారావు ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సొనాయి రత్నకుమారి, ఎస్‌వీవీ.రమణమూర్తి పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనా మందిరాల వద్ద క్రిస్మస్ తాతలు సందడి చేశారు.