క్రీడలతో విద్యార్థుల్లో మానసిన ఉల్లాసం
ABN , First Publish Date - 2021-03-24T06:06:06+05:30 IST
క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు.

ఐటీ డీఏ పీవో వెంకటేశ్వర్
పాడేరు, మార్చి 23: క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఐటీడీఏ పీవో డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అన్నారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల ఆవరణలో మంగళవారం జోనల్ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా పీవో మాట్లాడుతూ.. ఏజెన్సీలో పాడేరు, చింతపల్లి, పెదబయలు, అరకులోయ జోన్‌లుగా విభజించి పాఠశాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఆసక్తి చూపే వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, వ్యాయమ క్రీడల్లో జోనల్ స్థాయిలో పోటీలు అనంతరం విజేతలతో డివిజన్ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారన్నారు. గిరి విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని పీవో వెంకటేశ్వర్ ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ విద్యా శాఖ డీడీ జి.విజయకుమార్, ఏటీడబ్ల్యూవో ఎల్.రజని, మూడు మండలాలకు చెందిన వ్యాయామ సంచాలకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.