వైద్య విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలి
ABN , First Publish Date - 2021-11-21T05:57:10+05:30 IST
వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలని, దీంతో పారిశ్రామికవేత్తలుగా, ఆస్పత్రుల పరిపాలకులుగా, వైద్యసేవల నిర్వాహకులుగా మారడానికి అవకాశాలు లభిస్తాయని ‘గీతం’ అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అన్నారు.

‘గీతం’ అధ్యక్షుడు ఎం.శ్రీభరత్
ఎండాడ, నవంబరు 21: వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించాలని, దీంతో పారిశ్రామికవేత్తలుగా, ఆస్పత్రుల పరిపాలకులుగా, వైద్యసేవల నిర్వాహకులుగా మారడానికి అవకాశాలు లభిస్తాయని ‘గీతం’ అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ (జిమ్‌సర్) వైద్య కళాశాలలో వార్షిక క్రీడా సాంస్కృతిక ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబీబీఎస్ కోర్సు తర్వాత పోస్టు గ్రాడ్యుయేషన్ ఒక్కటే కాకుండా పలు అవకాశాలు ఉన్నాయని వివరించారు. గీతం వైద్య విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే ఆరోగ్య సేవకులుగా మారాలని పిలుపునిచ్చారు. జిమ్‌సర్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతి పద్మజ మాట్లాడుతూ 2022 విద్యా సంవత్సరం నుంచి కొత్త పీజీ కోర్సుల ప్రారంభానికి మెడికల్ కౌన్సిల్ అనుమతి లభించిందన్నారు. ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర్ ద్వారకానాథ్ మాట్లాడుతూ కొవిడ్ సమయంలో బాధితులకు విశేష సేవలందించా మన్నారు. అనంతరం పలు పోటీల్లో ప్రతిభ కనబరిచిన గీతం వైద్య కళాశాల 2016 బ్యాచ్ విద్యార్థులకు రోలింగ్ ట్రోఫీని శ్రీభరత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిమ్‌సర్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.