ఆలయాల అభివృద్ధికి చర్యలు

ABN , First Publish Date - 2021-09-02T06:21:00+05:30 IST

ఆలయాల అభివృద్ధికి దశల వారీగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు.

ఆలయాల అభివృద్ధికి చర్యలు
ఆలయ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌


అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 1: ఆలయాల అభివృద్ధికి దశల వారీగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. మెయిన్‌ రోడ్డులోని సిద్ధిలింగేశ్వర ఆలయ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 19 దేవాలయాలను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు. ఆలయాలకు సొంతంగా ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, ఆలయ ఈవో కె.ఆదినారాయణ, వైసీపీ నాయకులు మందపాటి జానకిరామరాజు, కొణతాల మురళీకృష్ణ, బొడ్డేడ శివ, జాజుల రమేశ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-02T06:21:00+05:30 IST