పీహెచ్‌సీల ఆధునికీకరణకు చర్యలు

ABN , First Publish Date - 2021-01-20T06:04:37+05:30 IST

మన్యంలో పీహెచ్‌సీలను ఆధునికీకరించి, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర సీనియర్‌ హెల్త్‌ కో-ఆర్డినేటర్‌ ఎన్‌.మూర్తి అన్నారు.

పీహెచ్‌సీల ఆధునికీకరణకు చర్యలు
అనంతగిరి పీహెచ్‌సీని సందర్శించిన వైద్యబృందం సభ్యులు


అనంతగిరి, జనవరి 19: మన్యంలో పీహెచ్‌సీలను ఆధునికీకరించి, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర సీనియర్‌ హెల్త్‌ కో-ఆర్డినేటర్‌ ఎన్‌.మూర్తి అన్నారు. మంగళవారం ఆయన నేతృత్వంలో వైద్యనిపుణుల బృందం స్థానిక పీహెచ్‌ని సందర్శించి ఇక్కడ ఉన్న వసతులను పరిశీలించారు. పీహెచ్‌సీ భవనం శిఽథిలావస్థకు చేరడంతో త్వరలో నూతన భవనాన్ని మంజూరు చేస్తామన్నారు. మన్యంలో సికిల్‌ సెల్‌ ఎనీమియా, ఇంటిగ్రేటెడ్‌  హెల్త్‌, ట్రైబల్‌ హెర్బల్‌ మెడిసిన్‌ అభివృద్ధిపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరఖండ్‌కు చెందిన సీనియర్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ విజయప్రసాద్‌ భట్‌, జేఎన్‌టీయూ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, హైదరాబాద్‌ హెల్త్‌కేర్‌ అండ్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ కేవీజీఎస్‌ మూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T06:04:37+05:30 IST