రైతుబజార్‌ దుకాణాల కేటాయింపునకు చర్యలు

ABN , First Publish Date - 2021-12-09T05:33:56+05:30 IST

స్థానిక రైతుబజార్‌లో అర్హులైన వారికి దుకాణాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పెదలబుడు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు తెలిపారు.

రైతుబజార్‌ దుకాణాల కేటాయింపునకు చర్యలు
రైతుబజార్‌లో నంబరింగ్‌ పనులను పరిశీలిస్తున్న సర్పంచ్‌ దాసుబాబు, వార్డు సభ్యులు


పెదలబుడు సర్పంచ్‌ దాసుబాబు

అరకులోయ, డిసెంబరు 8: స్థానిక రైతుబజార్‌లో అర్హులైన వారికి దుకాణాలను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పెదలబుడు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు తెలిపారు. బుధవారం సాయంత్రం వార్డు సభ్యులతో కలిసి రైతుబజార్‌లో నంబ రింగ్‌ పనులను పరిశీలించారు. రైతుబ జార్‌లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్‌కు సహా రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం కల్పించాలన్నారు. రైతుబజారు బయట వాహనాల పార్కింగ్‌కు చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శి శేఖర్‌బాబుని ఆదేశించారు. రైతుబజార్‌లో 60 దుకాణాలకు నంబరింగ్‌ వేశామని, భవననిర్మాణం ప్రారంభానికి ముందే 41 మంది అర్హులను గుర్తించినట్టు చెప్పారు. తొలుత వారందరికీ దుకాణాలు కేటాయిస్తామని, అనంతరం మిగిలిన  వారికి కేటాయిస్తామన్నారు. ప్రస్తుతం 70 మంది వరకు దుకాణాల కోసం పేర్లు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఆయన వెంట వార్డు సభ్యులు త్రినాథ్‌, ఆర్‌కే సత్యనారాయణ, వైస్‌ సర్పంచ్‌ విజయనిర్మల, చందు, కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-12-09T05:33:56+05:30 IST