కొమిరలో వైభవంగా మరిడిమాంబ జాతర

ABN , First Publish Date - 2021-02-26T05:47:53+05:30 IST

మండలంలో కొమిర గ్రామంలో గురువారం మరిడిమాంబ జాతర వైభవంగా జరిగింది.

కొమిరలో వైభవంగా మరిడిమాంబ జాతర
పోటీలో పరుగు తీస్తున్న ఎడ్ల బండ్ల్లు

జిల్లా స్థాయి ఎడ్ల బండ్ల పోటీల విజేత కేజే పురం 


రావికమతం, ఫిబ్రవరి 25: మండలంలో కొమిర గ్రామంలో గురువారం మరిడిమాంబ జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల బండ్ల పరుగు పోటీల్లో 18 బండ్లు పాల్గొన్నాయి. మొదటి, రెండు, ఆరు స్థానాల్లో కేజే పురం కోయిలాడ మోహన్‌ బండి నిలిచింది. అలాగే మూడో స్ధానంలో కొత్తబోయిపాడుకు చెందిన గండి కాసులునాయుడు బండి, నాలుగులో కూడ్రంకు చెందిన మరిడిమాంబ బండి, ఐదులో ఎం.కోటపాడుకు చెందిన పాచిల నాగరాజు బండి నిలిచాయి. వీరికి ఉత్సవ కమిటీ ప్రతినిధులు నగదు బహుమతులు అందజేశారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్‌ దీపాల అలంకరణలు ఆకట్టుకున్నాయి.

Updated Date - 2021-02-26T05:47:53+05:30 IST