నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు రీ షెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-07-09T04:59:28+05:30 IST

రామేశ్వరం, మండపం రైల్వే స్టేషన్ల మధ్య బ్రిడ్జి నిర్వహణ పనులు కారణంగాను, చెన్నై డివిజన్‌లో పలు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రీ షెడ్యూల్‌ చేయడంతోపాట కొన్ని రైళ్లను మళ్లింపు మార్గాల్లో నడుపుత్నుట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు రీ షెడ్యూల్‌

కొన్ని రైళ్లు దారి మళ్లింపు

విశాఖపట్నం, జూలై 8: రామేశ్వరం, మండపం రైల్వే స్టేషన్ల మధ్య  బ్రిడ్జి నిర్వహణ పనులు కారణంగాను, చెన్నై డివిజన్‌లో పలు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రీ షెడ్యూల్‌ చేయడంతోపాట కొన్ని రైళ్లను మళ్లింపు మార్గాల్లో నడుపుత్నుట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. 


రీ షెడ్యూల్‌ రైళ్లు

ఈనెల 20న మధ్యాహ్నం 12.40 గంటలకు హౌరాలో బయలుదేరాల్సిన 06598 నంబరు హౌరా-యశ్వంత్‌పూర్‌ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరుతుంది. 25న ఉదయం 5.15 గంటలకు టాటానగర్‌లో బయలు దేరాల్సిన 08189 నంబరు టాటానగర్‌-ఎర్నాకులం ప్రత్యేక రైలు 6.15 గంటలకు బయలుదేరుతుంది. 8, 13, 15వ తేదీల్లో ఉదయం 11 గంటలకు యశ్వంత్‌పూర్‌లో   బయలుదేరాల్సిన 02246 నంబరు ప్రత్యేక రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతుంది. 17న ఉదయం 10.15 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరాల్సిన 02874 నంబరు యశ్వంత్‌పూర్‌-హౌరా ప్రత్యేక రైలు 11.15 గంటలకు బయలుదేరుతుంది. 8, 15వ తేదీల్లో ఉదయం 9.55 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరాల్సిన 06597 నంబరు ప్రత్యేక రైలు ఉదయం 10.55 గంటలకు బయలుదేరుతుంది.


మళ్లింపు మార్గంలో...

06169 నంబరు పురిలియా-విల్లుపురం ప్రత్యేక రైలు ఈనెల 9, 12, 16, 19, 23 తేదీల్లో వయా తిరుత్తని, మెల్పక్కం, కాంచీపురం, చెంగల్‌పట్టు, విల్లుపురం మీదుగా నడవ నుంది. అలాగే 06170 నంబరు విల్లుపురం-పురూలియా ప్రత్యేక రైలు ఈనెల 10న వయా విల్లుపురం, చెంగల్‌పట్టు, కాంచీపురం, మెల్కప్పం, తిరుత్తని మీదుగా నడుస్తుంది. 

06177 నంబరు ఖర్గపూర్‌-విల్లుపురం ప్రత్యేక రైలు ఈనెల 22న వయా విల్లుపురం, చెంగల్‌పట్టు, కాంచీపురం, మెల్కప్పం, తిరుత్తని మీదుగా నడవ నుంది. అలాగే, 06178 నంబరు విల్లుపురం-ఖర్గపూర్‌ ప్రత్యేక రైలు ఈనెల 13న వయా విల్లుపురం,  చెంగల్‌పట్టు, కాంచీపురం, మెల్కప్పం, తిరుత్తని మీదుగా నడుస్తుంది. 


Updated Date - 2021-07-09T04:59:28+05:30 IST