కరోనా బాధితుల కోసం రైల్వేలో ‘హ్యుమిడిఫైర్’ తయారీ
ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST
వాల్తేరు డీజిల్ లోకోషెడ్ సిబ్బంది కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ ‘హ్యుమిడిఫైర్’ రూపొందించారు

విశాఖపట్నం, మే 5(ఆంధ్రజ్యోతి): వాల్తేరు డీజిల్ లోకోషెడ్ సిబ్బంది కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ ‘హ్యుమిడిఫైర్’ రూపొందించారు. మార్కెట్‌లో ప్రస్తుతం సిలిండర్ రెగ్యులేటర్, ఆక్సిజన్ ఫ్లో మీటర్లు అందుబాటులో లేవు. ఈ సమస్యను గుర్తించిన రైల్వే అధికారులు, ఆక్సిజన్ రెగ్యులేటర్‌తోపాటు గాలిలో తేమను తీసుకుని ఆక్సిజన్‌ను మాత్రమే అందించే ‘హ్యుమిడిఫైర్’ రూపొందించారు. దీనికి వారికి రూ.475 మాత్రమే వ్యయం అయింది. మొత్తం 15 పరికరాలు తయారు చేసి డీఆర్‌ఎం ద్వారా రైల్వే ఆస్పత్రికి అందజేశారు. వీటివల్ల ఫ్లో మీటర్ అవసరం ఇక లేదని, బాగా పనిచేస్తున్నాయని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. సీనియర్ మెకానికల్ ఇంజనీర్ సంతోశ్ కుమార్ నేతృత్వంలో వీటిని తయారు చేశారు.