గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-26T05:46:29+05:30 IST

మండలంలోని రెడ్డిపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ పెయింటర్‌ మృతి చెందినట్టు శనివారం పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మృతుడు రమణ (ఫైల్‌ ఫొటో)

పద్మనాభం, డిసెంబరు 25: మండలంలోని రెడ్డిపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ పెయింటర్‌ మృతి చెందినట్టు శనివారం పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణాపురం ఎస్సీ కాలనీకి చెందిన ధనాల రమణ (పెయింటర్‌) విజయనగరంలో పెయుంట్‌ డబ్బా కొని తిరిగి వస్తుండగా శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆయన తలకు, కాలుకు తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అదే సమయంలో విజయనగరం నుంచి వస్తున్న హంస సురేంద్ర అనే వ్యక్తి రమణను గుర్తించి ఆయన బంధువైన పల్లా అప్పలరాజుకు సమాచారం అందించాడు. ఆయన 108 వాహనానికి సమాచారం అందించగా వాహన సిబ్బంది వచ్చి చూడగా అప్పటికే రమణ మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందడంతో సీఐ వి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్సై అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-12-26T05:46:29+05:30 IST