భార్య మృతితో మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-19T06:14:37+05:30 IST

కరోనాతో నాలుగు నెలల క్రితం భార్య మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హరిజనజగ్గయ్యపాలెంలో చోటు చేసుకుంది.

భార్య మృతితో మనస్తాపానికి గురై  వ్యక్తి ఆత్మహత్య

అక్కిరెడ్డిపాలెం(విశాఖపట్నం), డిసెంబరు 18: కరోనాతో నాలుగు నెలల క్రితం భార్య మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హరిజనజగ్గయ్యపాలెంలో చోటు చేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన శరగడం సన్యాసిరావు(50) గత రెండేళ్లుగా హరిజన జగ్గయ్యపాలెం కాలనీలో టైలరింగ్‌  వృత్తి చేసుకొని జీవిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో భార్య కరోనాతో మృతి చెందడంతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యారు. ఇద్దరు కుమారులు, కుమార్తె వారి స్వగ్రామం బొబ్బిలిలో ఉంటున్నారు. దీంతో ఒంటరిగా వుంటున్న సన్యాసిరావు ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందారు. బట్టలు కుట్టడానికి ఇచ్చిన కొందరు ఇంటికి వచ్చి పిలవగా, తలుపులు తెరవలేదు. దీంతో అనుమానంతో కిటికీలో నుంచి చూడగా  సన్యాసిరావు ఉరి వేసుకొని వుండడాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజిహెచ్‌కు తరలించి, గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-12-19T06:14:37+05:30 IST