మానవహారం విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-08-26T05:21:19+05:30 IST

ప్లాంట్‌ పరిరక్షణకు ఈ నెల 29న తలపెట్టనున్న 10కె మానవహారాన్ని విజయవంతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ పేర్కొన్నారు.

మానవహారం విజయవంతం చేయండి
మాట్లాడుతున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు

ఉక్కుటౌన్‌షిప్‌, ఆగస్టు 25: ప్లాంట్‌ పరిరక్షణకు ఈ నెల 29న తలపెట్టనున్న 10కె మానవహారాన్ని విజయవంతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ పేర్కొన్నారు. సీఐటీయూ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయరాదని డిమాండ్‌ చేస్తూ  ఎన్నో పోరాటాలు చేస్తున్నామని, అయినప్పటికీ  కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మానవహారంతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డి.ఆదినారాయణ,  గంధం వెంకటరావు, వరసాల శ్రీనివాసరావు, వై.మస్తానప్ప, బొడ్డు పైడిరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-26T05:21:19+05:30 IST