మానవహారాన్ని విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-08-28T05:19:46+05:30 IST

ఈ నెల 29న అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 10 వేల మందితో, 10 కి.మీ. పరిధిలో నిర్వహించు మానవహారాన్ని విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు యు.రామస్వామి పిలుపునిచ్చారు.

మానవహారాన్ని విజయవంతం చేయండి
రిలే నిరాహార దీక్షల శిబిరంలో ప్రసంగిస్తున్న రామస్వామి

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు యు.రామస్వామి

కూర్మన్నపాలెం, ఆగస్టు 27: ఈ నెల 29న అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 10 వేల మందితో, 10 కి.మీ. పరిధిలో నిర్వహించు మానవహారాన్ని విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు యు.రామస్వామి పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 197వ రోజు కొనసాగాయి. శుక్రవారం ఈ దీక్షలలో బీఎఫ్‌ కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో రామస్వామి మాట్లాడుతూ  ప్రతి నిర్వాసిత గ్రామంలో సభలను నిర్వహించి, ప్రజలను చైతన్యం చేస్తున్నట్టు వివరించారు. గంగవరం పోర్టులోని రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటాను అదానీ గ్రూపునకు విక్రయించడం వలన ప్లాంట్‌పై రవాణా ఖర్చులు పెరుగుతాయన్నారు. ఉక్కు పోరాట కమిటీ సభ్యులు అయోధ్యరామ్‌, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, జి.ఆనంద్‌, వరసాల శ్రీనివాసరావు, మస్తానప్ప, మురళీరాజు, రామచంద్రరావు, వెంకటరావు, కోటేశ్వరరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T05:19:46+05:30 IST