చివరి రోజున జోరుగా నామినేషన్లు

ABN , First Publish Date - 2021-02-01T06:39:53+05:30 IST

మండలంలో చివరిరోజు ఆదివారం పంచాయతీలకు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు మద్దతుదారులతో తరలిరావడంతో నామినేషన్లు కార్యాలయాల వద్ద సందడి నెలకొంది.

చివరి రోజున జోరుగా నామినేషన్లు
అభ్యర్థులకు మద్దతుగా తరలివచ్చిన కార్యకర్తలు

చోడవరం, జనవరి 31: మండలంలో చివరిరోజు ఆదివారం పంచాయతీలకు జోరుగా నామినేషన్లు  దాఖలయ్యాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు మద్దతుదారులతో తరలిరావడంతో నామినేషన్లు కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. మండలంలోని వెంకన్నపాలెం వద్ద ముద్దుర్తి, దుడ్డుపాలెం, గంధవరం, వెంకన్నపాలెం పంచాయతీలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు భారీగా తరలివచ్చారు.  మేజర్‌ పంచాయతీలైన చోడవరం, గోవాడలో  పెద్దగా హడావిడి కనిపించలేదు. చివరిరోజు కావడంతో చాలా కేంద్రాల వద్ద రాత్రి వరకూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. 


 మూడు పంచాయతీలకు ఒక్కో నామినేషన్‌

తిమ్మనపాలెం, జి.జగన్నాధపురం, సింహాద్రిపురం పంచాయతీ సర్పంచ్‌ పదవికి ఒక్కో నామినేషన్‌ మాత్రమే దాఖలయింది. వైసీపీ మద్దతుతో తిమ్మనపాలెంలో గొర్లె రాము,  సింహాద్రిపురంలో  దంతులూరి భవానీ, జి. జగన్నాథపురంలో రొంగలి రామారావు నామినేషన్లు వేశారు. 


చోడవరం సర్పంచ్‌ పదవికి 8 

 స్థానిక మేజర్‌ పంచాయతీకి ఆదివారం 8 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.  టీడీపీ మద్దతుతో మాజీ సర్పంచ్‌ దొమ్మేసి అప్పలనర్సగిరి, సియ్యాద్రి లక్ష్మి,  వైసీపీ మద్దతుతో కొత ్తపల్లి చంద్రకళ, జుంజూరు లక్ష్మి మరో నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. డమ్మీలుగా మరికొందరు నామినేషన్లు వేశారు. బెన్నవోలు మూడెడ్ల శంకరరావు, మజ్జి గౌరీశంకర్‌ నామినేషన్లు దాఖలు చేశారు. 


బుచ్చెయ్యపేటలో 864

బుచ్చెయ్యపేట: మండలంలోని వివిధ పంచాయతీల పరిధిలో ఆదివారం 856 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్‌ పదవులకు 218, వార్డు సభ్యులకు 646 నామినేషన్లు వేశారు. దీంతో ప్రక్రియ ముగిసే సరికి మండల వ్యాప్తంగా 1263 నామినేషన్లు దాఖలు కాగా, సర్పంచ్‌పదవులకు 218 మంది, వార్డు సభ్యులకు 1045 మంది నామినేషన్లు వేశారు. 


Updated Date - 2021-02-01T06:39:53+05:30 IST