10న జాతీయ లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-06-22T05:27:01+05:30 IST

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జూలై 10వ తేదీన ‘జాతీయ లోక్‌ అదాలత్‌’ విశాఖలో నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి కె.కె.వి.బులికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.

10న జాతీయ లోక్‌ అదాలత్‌

జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రయత్నం

రాజీపడే కేసుల్లో ఇరువర్గాలు ముందస్తు సమాచారం ఇవ్వాలి

డాబాగార్డెన్స్‌, జూన్‌ 21: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (న్యూఢిల్లీ), రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జూలై 10వ తేదీన ‘జాతీయ లోక్‌ అదాలత్‌’ విశాఖలో నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయాధికార సంస్థ కార్యదర్శి కె.కె.వి.బులికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అదాలత్‌లో జిల్లాలోని వివిధ న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్‌ కేసులు, సివిల్‌, చెక్‌బౌన్స్‌, బ్యాంకింగ్‌, మోటారు ప్రమాదాల కేసులు, సెక్షన్‌ 138 నెగోషిబుల్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ చట్టం కేసులు, రికవరీ కేసులు, ల్యాండ్‌ ఎక్విజిషన్‌ కేసులు, రెవెన్యూ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు (విడాకులు కేసులు మినహా), పారిశ్రామిక వివాదాలు, రాజీపడ్డదగ్గ క్రిమినల్‌ కేసులు పరిష్కరించుకోవచ్చునని తెలిపారు.  రాజీపడదగ్గ కేసుల్లో ఇరువర్గాలు రాజీకి అంగీకరిస్తే తమ సంసిద్ధతను సదరు కోర్టు వారికి/జిల్లా న్యాయసేవాధికార సంస్థ, విశాఖపట్నం వారికి తెలియజేయాలని సూచించారు. 

Updated Date - 2021-06-22T05:27:01+05:30 IST