గృహ నిర్మాణదారులకు పావలా వడ్డీకి రుణాలు

ABN , First Publish Date - 2021-12-26T04:16:26+05:30 IST

ళ్ల నిర్మాణ లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండే తెలిపారు.

గృహ నిర్మాణదారులకు పావలా వడ్డీకి రుణాలు
ఎస్‌ఆర్‌పురంలోని జగనన్న కాలనీలో పర్యటిస్తున్న రాహుల్‌పాండే

రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండే

పెందుర్తి, డిసెంబరు 25: ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండే తెలిపారు. మండలంలోని ఎస్‌ఆర్‌ పురం, వాలిమెరకలో జగనన్న కాలనీలను శనివారం ఆయన సందర్శించి  ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణ వ్యయం, ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. ఇళ్ల నిర్మాణాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపుల సౌజన్యంతో ఇళ్ల నిర్మాణదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం బ్యాంకర్లకు సూచన చేసిందన్నారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణ రుణాలపై బ్యాంకర్లు విధించే వడ్డీ ఏడు శాతంలో లబ్ధ్దిదారులు మూడు శాతం చెల్లిస్తే, ప్రభుత్వం నాలుగు శాతం భరిస్తుందన్నారు. పేదల గృహాలు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట జాయింట్‌ కలెక్టర్‌ కల్పన, తహసీల్దార్‌ పైల రామారావు, ఎంపీడీవో మంజులవాణి , ఎంపీపీ మదుపాడ నాగమణి, హౌసింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-26T04:16:26+05:30 IST