లైన్‌మన్‌ హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్‌

ABN , First Publish Date - 2021-11-09T06:01:10+05:30 IST

మండలంలోని ఏనుగులపాలెంలో విద్యుత్‌ లైన్‌మన్‌ మొల్లి బంగార్రాజును హతమార్చిన కేసులో అరెస్టు చేసిన కోరాడ గోవింద్‌కు భీమిలి కోర్టు సోమవారం 14 రోజుల రిమాండ్‌ విధించినట్టు పద్మనాభం పోలీసులు తెలిపారు.

లైన్‌మన్‌ హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్‌

పద్మనాభం, నవంబరు 8: మండలంలోని ఏనుగులపాలెంలో విద్యుత్‌ లైన్‌మన్‌ మొల్లి బంగార్రాజును హతమార్చిన కేసులో అరెస్టు చేసిన కోరాడ గోవింద్‌కు భీమిలి కోర్టు సోమవారం 14 రోజుల రిమాండ్‌ విధించినట్టు పద్మనాభం పోలీసులు తెలిపారు. హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గోవింద్‌ను అరెస్టు చేసి భీమిలి 16వ మెట్రోపాలిటన్‌ మెజిస్ర్టేట్‌ ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించడంతో నిందితుడిని కేంద్ర కారాగారానికి తరలించినట్టు వారు పేర్కొన్నారు.


Updated Date - 2021-11-09T06:01:10+05:30 IST