టీడీపీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిద్దాం
ABN , First Publish Date - 2021-10-28T06:11:08+05:30 IST
నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిద్దామని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్ అన్నారు.

పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్
మాడుగుల రూరల్, అక్టోబరు 27: నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిద్దామని టీడీపీ మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్ అన్నారు. మండలంలోని వీజే పురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలను బుధవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో కుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి కలిసికట్టుగా శ్రమిద్దామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చామంతలు జయరామ్, శనివాడ నాయుడు, శ్రీను, జెర్రిపోతుల రామారావు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.