టీడీపీకి పూర్వ వైభవం తీసుకొద్దాం..

ABN , First Publish Date - 2021-12-30T06:12:49+05:30 IST

టీడీపీకి కంచుకోటగా పేరొందిన మాడుగుల నియోజకవర్గానికి పూర్వవైభవం తీసుకొద్దామని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ పిలుపునిచ్చారు.

టీడీపీకి పూర్వ వైభవం తీసుకొద్దాం..
సమావేశంలో మాట్లాడుతున్న కుమార్‌

రాష్ట్రంలో రౌడీ రాజ్యానికి చెక్‌ పెడతాం

మాడుగుల నియోజకవర్గ ఇన్‌చార్జి కుమార్‌ 


మాడుగుల రూరల్‌, డిసెంబరు 29: టీడీపీకి కంచుకోటగా పేరొందిన మాడుగుల నియోజకవర్గానికి పూర్వవైభవం తీసుకొద్దామని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ పిలుపునిచ్చారు. మాడుగుల పార్థసారథి ఆలయం సమీపంలో పార్టీ మండల అధ్యక్షుడు అద్దేపల్లి జగ్గారావు అధ్యక్షతన మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని నాయకులు, కార్యకర్తలతో బుధవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నిత్యావసర ధరలు పెరిగిపోయాయన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో రౌడీ రాజకీయం నడుస్తున్నదని, దానికి చెక్‌ పెట్టాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎంగా చంద్రబాబును గద్దెనెక్కించాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉందని చెప్పారు. అందుకనుగుణంగా తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని, క్యాడర్‌ సహకరించాలని కకోరారు. మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు మాట్లాడుతూ, పార్టీ నియమించిన వారికే మద్దతు ఇచ్చి క్యాడర్‌ను కాపాడుకోవాలన్నారు. ఐకమత్యంతో ముందుకెళ్లినప్పుడే పార్టీ  బలోపేతమవుతుందన్నారు.  టీడీపీ అధినేత నిర్ణయం, పార్టీ సిద్ధాంతాల మేరకు పార్టీని ముందుకు నడిపించేందుకు పాటుపడుతున్నామని పలువురు వక్తలు పేర్కొన్నారు. అనంతరం పీవీజీకి శాలువాలు కప్పి సత్కరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు అద్దిపల్లి జగ్గారావు, పుప్పాల అప్పలరాజు, రంజిత్‌ వర్మ, కాశిబాబు, సన్యాసిరావు, పేరపు కొండబాబు, కాళ్ల నరసింగరాజు, పోతల పాత్రినాయుడు, జూరెడ్డి రాము, కశిరెడ్డి అప్పలనాయుడు, రాంబాబు, డిల్లీ నానాజీ, సత్యవతి పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-30T06:12:49+05:30 IST