లారీ సప్లయర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-09-02T05:37:09+05:30 IST

జిల్లా లారీ సప్లయర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది.

లారీ సప్లయర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
జిల్లా లారీ సప్లయర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులను సత్కరిస్తున్న దృశ్యం

గాజువాక, సెప్టెంబరు 1:  జిల్లా లారీ సప్లయర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం బుధవారం బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షుడిగా శ్రీలేఖ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడిగా దుర్గాభవాని శ్రీను, ప్రధాన కార్యదర్శిగా ఈటి ప్రకాశ్‌, కోశాధికారిగా అనిల్‌, సంయుక్త కార్యదర్శిగా రాజేశ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. అసోసియేషన్‌ బలోపేతానికి అందరి సహకారంతో ముందుకు సాగుతామని ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సత్కరించారు.

Updated Date - 2021-09-02T05:37:09+05:30 IST