పర్యాటక రంగం అభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-11-21T06:14:48+05:30 IST

ఏజెన్సీలో పర్యాటక రంగం అభివృద్ధికి ఐటీ డీఏ పెద్దపీట వేస్తుందని ప్రాజె క్టు అధికారి గోపాలక్రిష్ణ అన్నారు. ఐటీడీఏ కార్యాలయ సముదాయంలో ఏర్పాటుచేసిన టూరిజం సెల్‌ను శనివారం ఆయన ప్రారంభించారు.

పర్యాటక రంగం అభివృద్ధికి పెద్దపీట
టూరిజం సెల్‌ను ప్రారంభిస్తున్న పీవో గోపాలక్రిష్ణ


 ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ

పాడేరు, నవంబరు 20: ఏజెన్సీలో పర్యాటక రంగం అభివృద్ధికి ఐటీ డీఏ పెద్దపీట వేస్తుందని ప్రాజె క్టు అధికారి గోపాలక్రిష్ణ అన్నారు. ఐటీడీఏ కార్యాలయ సముదాయంలో ఏర్పాటుచేసిన టూరిజం సెల్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధితోపాటు, ఆయా ప్రాంతాల్లో పరిశుభ్రత, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం టూరిజం సెల్‌ ద్వారా చేపడతామన్నారు. అలాగే పర్యాటకుల కోసం వేసే టెంట్ల నిర్వాహకులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని టూరిజం అధికారులను ఆదేశించారు. అలాగే ఐటీడీఏలో ఎంప్లాయీమెంట్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను పీవో గోపాలక్రిష్ణ ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్‌.ప్రభాకరరావు, ఏవో నాగేశ్వరరావు, ఏఏవో శ్రీనివాసకుమార్‌, టూరిజం మేనేజర్‌ దాసు, కాంట్రాక్టర్‌ కృష్ణారెడ్డి  పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-21T06:14:48+05:30 IST