‘లంబసింగి’ షూటింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-02-01T06:51:57+05:30 IST

పట్టణంలోని షిర్డీసాయిబాబు ఆలయంలో ఆదివారం ‘లంబసింగి’ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.

‘లంబసింగి’ షూటింగ్‌ ప్రారంభం
చిత్ర యూనిట్‌తో ఎమ్మెల్యే గణేశ్‌

   హీరో హీరోయిన్‌గా భరత్‌రాజ్‌, దివి

 నవీన్‌గాంధీ దర్శకత్వంలో 35 రోజులపాటు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో షూటింగ్‌


నర్సీపట్నం, జనవరి 31: పట్టణంలోని షిర్డీసాయిబాబు ఆలయంలో ఆదివారం ‘లంబసింగి’ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కాన్సెప్ట్‌ ఫిలిమ్స్‌ పతాకంపై భరత్‌రాజ్‌, దివి (బిగ్‌బాస్‌ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా జీకే మోహన్‌ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవీన్‌గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.  ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌  తొలి క్లాప్‌ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. దర్శకుడు నవీన్‌గాంధీ విలేఖరులతో మాట్లాడుతూ నర్సీపట్నం, లంబసింగి, పాడేరు, చింతపల్లి, కొత్తపల్లి జలాశయం పరిసర ప్రాంతాల్లో 35 రోజుల సింగిల్‌ షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తి చేస్తామన్నారు. గ్రామీణ వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ ప్రేమ కథాచిత్రంగా, అద్భుతమై థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌లతో చిత్రం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ, చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-01T06:51:57+05:30 IST